నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపేవారిపై హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఎవరనీ విడవకుండ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సినీ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) దొరికిపోయారు. మనోజ్‌ నడుపుతున్న ఏపీ 39HY 0319 కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను గుర్తించిన పోలీసులు దానిని నిలిపివేశారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌ ఫిలిం ఉన్నందుకుగాను రూ.700 చలాన్ విధించారు. అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)