ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం ‘యాత్ర’. మహి వి రాఘవ్‌ (Mahi V Raghav) దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజ‌యం సాధించింది. మ‌ల‌యాళ న‌టుడు మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్ పాత్ర‌లో న‌టించి అల‌రించాడు. ఇక ఈ సూపర్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌గా యాత్ర 2 తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే.‘యాత్ర 2’ ఫిబ్రవరి 8న రిలీజ్‌ కానుంది.

వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ‘యాత్ర 2’ ఉంటుంది. ఈ చిత్రంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డిపాత్రలో మమ్ముట్టి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపాత్రలో జీవా నటిస్తున్నారు. యాత్ర 2 టీజ‌ర్‌ను జ‌న‌వ‌రి 05న ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదికగా వెల్ల‌డించింది. తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ‘‘ఒక మనిషి, లక్షల సమస్యలు.. అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి’’ అంటూ ‘యాత్ర 2’ టీజర్‌ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను షేర్‌ చేసింది యూనిట్‌

Here's First look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)