సినీ సంగీత ప్రపంచంలో మరో గొంతుక.. హఠాత్తుగా మూగబోయింది. సింగర్​ కేకే అలియాస్ కాయ్‌ కాయ్‌ అలియాస్‌​ కృష్ణకుమార్​ కున్నాత్‌(53) మంగళవారం రాత్రి కోల్​కతా ప్రదర్శన తర్వాత​ గుండెపోటుతో కన్నుమూశారు. ఈ వార్త సినీ ప్రపంచంతో పాటు ఆయన అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. బాలీవుడ్​తో పాటు తమిళ్​, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు. 1994లో లూయిస్​ బాంక్స్​, రంజిత్​ బారోత్​, లెస్లే లూయిస్​ వల్ల సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

1996లో వచ్చిన కాదల్​ దేశం(ప్రేమ దేశం) సినిమాలో హలో డాక్టర్​, కల్లూరి సాలే(కాలేజీ స్టయిలే..) పాటలతో ఆయన గొంతుక యువతరాన్ని ఊపేసింది. మిన్‌సారా కనవు(మెరుపు కలలు)లో ‍స్ట్రాబెర్రీ పెన్నే సాంగ్‌ ఆయన పేరు మారుమోగిపోయేలా చేసింది. అలాగే బాలీవుడ్‌లో ‘హమ్‌​ దిల్​ దే చుకే సనమ్’​(1999) ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. బాలీవుడ్‌తో పాటు మొత్తం 11 భాషల్లో ఆయన పాటలు పాడారు.

తెలుగులో శంకర్‌ మహదేవన్‌ తర్వాత.. హుషారెత్తించే గీతాలె‍న్నో ఆయన పాడారు. యే మేరా జహా (ఖుషీ), సున్‌సున్‌ సోనారే-పాటకి ప్రాణం(వాసు), దేవుడే దిగి వచ్చినా(సంతోషం), దాయి దాయి దామ్మా(ఇంద్ర), ఐ యామ్​ వెరీ సారీ (నువ్వే నువ్వే), నాలో నువ్వొక సగమై(జానీ), సీఎం పీఎం అవ్వాలన్నా(దిల్​), ఫీల్​ మై లవ్​(ఆర్య), చైల చైలా(శంకర్​ దాదా ఎంబీబీఎస్​), లే లే లేలే(గుడుంబా శంకర్​), ఇంతే ఇంతింతే..(బాలు ఏబీసీడీఎఫ్​జీ), అవును నిజం(అతడు), హే జానా..(జై చిరంజీవా), ఎగిరే మబ్బులలోనా(హ్యాపీ), ఒక చిన్ని నవ్వే నవ్వి(అశోక్​), నా పేరు చిన్నా(రణం), మై హార్ట్ ఈజ్​ బీటింగ్​(జల్సా).. లాంటి హుషారెత్తించే గీతాలెన్నో గుర్తుకు వస్తాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)