సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 వస్తున్న సంగతి విదితమే. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి మహేశ్‌ బాబు ఫస్ట్ లుక్‌ని రిలీజ్‌ చేశారు.

ఇందులో గళ్ల చొక్కా, తలకు రిబ్బన్‌ కట్టుకొని ఊరమాస్‌ లుక్‌లో మహేశ్‌ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ సినిమాలో మహేశ్‌ బాబు సరసన పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.కాగా ఈ మూవీ టైటిల్‌ను ఈనెల 31న రివీల్‌ చేయనున్నారు.

Mahesh Babu SSMB28 First Look

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)