దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రిన్స్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూడో సినిమా #SSMB 28 వర్కింగ్ టైటిల్ తో నేడు షూటింగ్ ప్రారంభించారు. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో మేకర్స్ షూట్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ మూవీలో మహేష్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
కాగా, కొద్ది సేపటి క్రితం లొకేషన్ లో జరుగుతున్న కొన్ని తెర వెనుక సన్నివేశాలతో అభిమానుల కోసం ఒక్క వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. అతడు & ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలిసి చేస్తున్న మూడవ సినిమా SSMB 28. ఇక ఈ సినమాలో పూజా హెగ్డే ఫీమేయిల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అలా పూర్తైతే 2023 ఏప్రిల్ 28 నాటికి తెలుగు, తమిళం, మలయాళం & హిందీలలో ఈ సినిమా విడుదల కానుంది.
MAHESH BABU - TRIVIKRAM REUNITE: FILMING BEGINS... #MaheshBabu and director #Trivikram reunite for a new film #SSMB28... Filming begins today... Costars #PoojaHegde... Produced by #SRadhakrishna... 28 April 2023 release. #SSMB28Aarambham pic.twitter.com/Waiqn2STfh
— taran adarsh (@taran_adarsh) September 12, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)