నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా NBK107 ట్రైలర్ విడుదలయింది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో బాలయ్య లుక్ ని రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. ఈ టీజర్ మాములుగా లేదు. బాలయ్య ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చారు దర్శకుడు గోపీచంద్ మలినేని. మాస్ డైలాగ్స్, మాస్ స్క్రీన్ ప్రెజన్స్ తో టీజర్ లో బాలయ్య హడావిడి ఓ రేంజ్ లో ఉంది. 'నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ - నా జీవో గాడ్స్ ఆర్డర్', 'భయం నా బయోడేటాలోనే లేదురా' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)