Hyderabad, Jan 17: కనుమ పండుగను (Kanuma Festival) పశుపక్ష్యాదులను ఆరాధించే పవిత్ర పర్వదినంగా భావిస్తారు. రైతు (Farmer) పొలం దున్నడం, విత్తడం, పండించిన ధాన్యం ఇంటికి చేర్చడం వరకు పశువుల సహకారం ఉంటుంది. యజమానులకు తోడ్పాటునందించే మూగజీవాలను కనుమ నాడు పూజించడం ఆనవాయతీ. కనుమ నాడు ప్రతి ఇంటా పశువులను అందంగా ముస్తాబు చేసి, ఇష్టమైన ఆహారాన్ని తినిపిస్తారు. కనుమ పండుగను పురస్కరించుకుని జనసేనాని (Janasena) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తన వ్యవసాయ క్షేత్రంలో గోపూజ వేడుకలు నిర్వహించారు. కనుమ వేడుక నేపథ్యంలో వ్యవసాయక్షేత్రంలోని గోవులకు పవన్ అరటిపళ్లు స్వయంగా తినిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
కనుమ అంటే పశుపక్ష్యాదులను గౌరవించే పండుగ రైతుకు వ్యవసాయంలో సాయంచేసే పశువులను ఆరాధించే వేడుక అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నేడు సంప్రదాబద్దంగా వ్యవసాయ క్షేత్రంలో కనుమ వేడుక జరిపారు.గోపూజ నిర్వహించారు ఆవులకు స్వయంగా అరటిపళ్ళు నోటికి అందించారు గోష్ఠంలోని అన్ని గోవులకు మేత వేశారు pic.twitter.com/TzMZ78Wgne
— JanaSena Party (@JanaSenaParty) January 16, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)