దురదృష్టవశాత్తూ కరోనా వల్ల కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. వారి వివరాలను sundeepkishancovidhelp@gamil.comకి పంపించండి. నేను, నా టీమ్‌ వారికి ఆహారాన్ని అందించడంతో పాటు సంరక్షణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటాం. అలాగే కొన్నేళ్ల పాటు విద్యను అందిస్తాం.. ఈ కష్ట సమయంలో అందరం ఒకరికొకరు తోడుగా నిలబడటం అత్యంత అవసరం. కాబట్టి మీరు కూడా మీ పరిసరాల్లో కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సహాయం చేయండి' అని పేర్కొంటూ సందీప్‌ కిషన్‌ ట్వీట్‌ చేశాడు.

"అందరికీ నమస్కారం.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. వారికి ఏమీ కాదు, ఆ చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. అందుకు ఒక పరిష్కారమార్గం ఉంది. 1098 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించండి. వారిని మంచి మనసున్నవారికి దత్తతివ్వండి" అని శృతీ హాసన్‌ పేర్కొంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)