రజనీకాంత్ మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrahim)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలేషియా వెళ్లిన రజనీకాంత్ (Rajinikanth) అక్కడ ప్రధానిని కలిసి కాసేపు ముచ్చటించారు. తన ఎక్స్‌లో (ట్విటర్) ఈ ఫొటోలను షేర్ చేసిన అన్వర్ ఇబ్రహీం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్‌ను కలవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.
ప్రజల కష్టాలు, ఆ కష్టాల సమయంలో నేను అందించిన సేవల పట్ల ఆయన గౌరవం ప్రదర్శించారు. అలాగే భవిష్యత్తులో ఆయన తీయనున్న సినిమాల్లో సామాజిక అంశాలు ఎక్కువగా ఉండేలా చూడాలని నేను కోరాను’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక 2017లోనూ రజనీకాంత్‌ను అప్పటి మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ కలిసిన విషయం తెలిసిందే. దీంతో మలేషియా పర్యాటక శాఖకు రజనీ బ్రాండ్ అంబాసిడర్ కానున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిపై స్పందించిన రజనీ.. ‘కబాలి’ షూటింగ్ ఎక్కువ భాగం మలేషియాలో జరిగిందని.. ఆ సమయంలో ప్రధానిని కలవడం కుదరకపోవడంతో ఇప్పుడు ఆయన ఆహ్వానించినట్లు తెలిపారు.
Here's Video
Define MASS.
Prime minister of Malaysia greets Superstar #Rajinikanth.
||#Thalaivar171||pic.twitter.com/1iAaNYhvTr
— Manobala Vijayabalan (@ManobalaV) September 11, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)