సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ద హంటర్’. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘వేట్టయన్- ద హంటర్’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో చిత్ర యూనిట్ వీడియోను విడుదల చేసింది.
ఇంతకీ ఈ ప్రివ్యూ వీడియోలో ఏముందనే వివరాల్లోకి వెళితే..."మనకు ఎస్.పి అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు" అని నేరస్థులు రజినీకాంత్ అంటే భయపడుతుంటారు. విలన్స్ 'వేట్టయన్' పేరు చెబితేనే హడలిపోతుంటారు. డీల్ చేయటానికి భయపడుతుంటారు. రౌడీయిజం పేరు చెప్పి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్న వారిని వేట్టయన్ వేటాడుతుంటాడని ప్రివ్యూ సన్నివేశాల్లో చూపిస్తూ వచ్చారు.
ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, ప్రతినాయకుడిగా నటించిన రానా దగ్గుబాటి, అభిరామి, మంజు వారియర్ పాత్రలను పరిచయం చేశారు. అసలు వీళ్ల పాత్రలకు, వేట్టయన్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్‌గా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న వేట్టయన్ జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే విషయాలు తెలుసుకోవాలంటే ‘వేట్టయన్- ద హంటర్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. ఆడియెన్స్‌కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వటానికి సిద్ధమవుతోన్న ఈ పాన్ ఇండియా సినిమా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)