దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర' సినిమా ఎలాంటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనికి సీక్వెల్ గా యాత్ర-2 ఫిబ్రవరి 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ మరో కానుక అందించింది. తొలి సమరం' అనే రెండో సాంగ్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను గౌతమ్‌ భరధ్వాజ్‌ ఆలపించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌ తెలుగు ప్రేక్షకుల గుండెలను తాకింది. ఆ టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కొద్దిరోజుల క్రితం 'చూడు నాన్న' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆ పాట కూడా ప్రేక్షకులను మెప్పించింది.

వైఎస్సార్‌ తనయుడు, ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' ఉంటుంది. త్రీ ఆట‌మ్ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రాన్ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు.

తొలి సమరం సాంగ్ ఇదిగో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)