ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్‌లోని రైసాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ పెన్షన్ కోసం పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు.
బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు.
Here's Video
80-year-old woman was forced to crawl nearly 2 km to panchayat office in Telkoi block of Odisha's Keonjhar to collect her old-age pension, despite a government directive to deliver the allowances to homes of elderly and disabled beneficiaries.@CMO_Odisha @BJP4Odisha… pic.twitter.com/DbtXXIrU74
— Siddhant Anand (@JournoSiddhant) September 24, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)