రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య భారత పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. 242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆ దేశంలో ఉన్న భారత పౌరులను, విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉక్రెయిన్‌కు వెళ్లిన ప్రత్యేక విమానంలో భారత్‌కు చెందిన 242 మంది ప్రయాణికులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామని విదేశాంగశాఖ సహాయమంతి మురళీధరన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
#WATCH | Air India special flight carrying around 242 passengers from Ukraine reaches Delhi pic.twitter.com/ctuW0sA7UY
— ANI (@ANI) February 22, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)