ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న సంగతి విదితమే. కాగా అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే ఢిల్లీ సీఎంగా కొనసాగనున్నారు. పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తిరస్కరించింది.ఆయన ఈడీ కస్టడీలో ఉన్నా సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.  సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు, తాత్కాలిక బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం, ఈడీకి నోటీసులు జారీ

ఢిల్లీ సీఎంకు విధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపర్చనుంది. ఈడీ కస్టడీ పొడిగింపు కోరుతుందా? లేదంటే రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశిస్తుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో మనీలాండరింగ్‌ అభియోగాలపై కేజ్రీవాల్‌ను మార్చి 21 ఆయన నివాసంలో ఈడీ అరెస్ట్‌ చేశారు. మరుసటి రోజు ఆయన్ను ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టుకు హజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో కోర్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)