Arvind Kejriwal news LIVE updates: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తాత్కాలిక బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ఈడీకి ఏప్రిల్ 2వ తేదీ వరకు గడువును ఇచ్చిన కోర్టు.. విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.
ఈడీ అరెస్టు చేసిన విధానం తప్పని.. సీఎంను విడుదల చేయాలని సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు. కేజ్రీవాల్‌కు మధ్యంతర ఉపశమనాన్ని కోర్టు పరిశీలిస్తుందని.. ప్రధాన పిటిషన్‌పై ఈడీకి నోటీసులు జారీ చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ్‌కాంత శర్మ తెలిపారు. కేజ్రీవాల్ మధ్యంతర ఉపశమనం కోరితే.. దాన్ని పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది. ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీరాజు వ్యతిరేకిస్తూ సమాధానం ఇచ్చేందుకు సమయం కోవాలని కోరారు. ఈడీ కస్టడీలో క్షీణించిన అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం, షుగర్ లెవల్స్ పడిపోయాయని వార్తలు
Here's ANI News
The bench of Justice Swarna Kanta Sharma stated that the respondent/ED has to be granted an opportunity to file a reply, as an opportunity for effective representation, and declining this opportunity would amount to denial of fair hearing as well as violation of one of the…
— ANI (@ANI) March 27, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)