Arvind Kejriwal’s First Reaction After Arrest: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రౌస్‌ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)లో హాజరుపరిచారు. మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్‌ తర్వాత ఆయన తొలిసారి మాట్లాడారు. ఎక్కడ ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటానని పేర్కొన్నారు.తన జీవితం దేశానికి అంకితం (My Life Dedicated To Nation) అని అన్నారు.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు, ఈడీ 10 రోజుల కస్టడీ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌ కోర్టు లోపలికి వెళ్తూ.. ‘నా జీవితం దేశానికి అంకితం. లోపల ఉన్నా బయట ఉన్నా దేశం కోసం పనిచేస్తుంటా’ అని పేర్కొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)