మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో... బాలినేనికి అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి, జనసేనలోకి సాదరంగా స్వాగతం పలికారు. ఇటీవలే బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా బాలినేనితో పాటు ఇవాళ జనసేన పార్టీలో చేరారు. ఉదయభాను, కిలారి రోశయ్యలకు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పవన్ వారికి సూచించారు.
Here's News
జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిక. pic.twitter.com/gHXjSXBJg5
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)