పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ సమయంలో ఇంజిన్ బ్లేడ్లు విరిగాయి. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.ఆదివారం అర్ధ రాత్రి తర్వాత 1.09 గంటలకు స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737 విమానం కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ నుంచి బ్యాంకాక్‌కు బయలుదేరింది.
అయితే ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్ అయిన సమయంలో ఆ విమానం ఎడమ ఇంజిన్‌లోని బ్లేడ్లు విరిగాయి. పైలట్లు వెంటనే దీనిని గ్రహించారు. ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. 1.27 గంటలకు తిరిగి ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన178 మంది ప్రయాణికులతోపాటు ఆరుగురు సిబ్బంది ఆ విమానంలో ఉన్నారు.ఈ సంఘటన నేపథ్యంలో మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది.
Here's Update
#SpiceJet | Bangkok-Bound SpiceJet Flight Returns To Kolkata After Engine Blade Breaks During Take-Off#Bangkok #SpiceJet #Kolkata https://t.co/h412KRiPVN
— India.com (@indiacom) February 27, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)