తమిళనాడు రాజధాని చెన్నైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్మగ్లర్ ఆటకట్టించారు. అతని దగ్గరున్న అరుదైన జీవులను స్వాధీనం చేసుకుని, అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు.బ్యాంకాక్ నుంచి వచ్చి చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన ఓ ప్రయాణికుడి లగేజీని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. దాంతో అతని రెండు బ్యాగులలో అరుదైన జీవులు కనిపించాయి. వాటిలో 45 బాల్‌ పైథాన్‌లు, మూడు కుచ్చుతోక కోతులు, మూడు నక్షత్ర తాబేళ్లు, ఎనిమిది కార్న్‌ స్నేక్స్‌ దొరికాయి. అధికారులు వాటిని సీజ్‌ చేసి తిరిగి బ్యాంకాక్‌కు పంపించారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)