AK-47 Recovery Caseలో ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డింది. పాట్నాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఇవాళ ఈ శిక్ష‌ను ఖ‌రారు చేసింది. 2019 ఆగ‌స్టులో ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంటి నుంచి ఏకే47 గ‌న్‌ను అధికారులు సీజ్ చేశారు. దాంతో పాటు క్యాట్రిడ్జ్‌లు, గ్రేనేడ్ల‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై తాజాగా స్పెష‌ల్ జ‌డ్జి త్రిలోకి దూబే తన తీర్పును వెలువ‌రించారు. అక్ర‌మ‌రీతిలో ఏకే47 గ‌న్ క‌లిగి ఉన్న కేసులో జూన్ 14వ తేదీన ఎమ్మెల్యేను కోర్టు దోషిగా తేల్చింది. ఇంటి నుంచి గ‌న్‌ల‌ను స్వాధీనం చేసుకున్న త‌ర్వాత ఎమ్మెల్యే ప‌రారీ అయ్యారు. ఆ త‌ర్వాత న్యూఢిల్లీలో పోలీసుల‌కు లొంగిపోయారు. 2005 నుంచి మోకామా సీటు నుంచి వరుస‌గా ఆయ‌న గెలుపొందారు. సీఎం నితీశ్‌కు మంచి మిత్రుడు. కానీ 2015లో జేడీయూ నుంచి అనంత్ వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న ఆర్జేడీలో చేరారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)