దేశంలో 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 పార్లమెంటరీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఈ ఉప ఎన్నికలు రెండు విడతల్లో జరుపుతున్నట్టు ప్రకటించింది. తొలివిడతలో భాగంగా నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలు, కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. రెండో విడతలో భాగంగా నవంబర్ 20న ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక, మహరాష్ట్రలోని నాందేడ్ పార్లమెంటరీ నియోజకవర్గం ఉపఎన్నిక ఉంటుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.

రాహుల్ గాంధీ యూపీలోని రాయబరేలి నియోజకవర్గాన్ని తన వద్దే ఉంచుకుని, కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గాన్ని వదులుకోవడంతో వయనాడ్‌లో ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ ఎంపీ వంసతరావ్ బల్వంతరావ్ చవాన్ గత ఆగస్టులో కన్నుమూయడంతో మహారాష్ట్రలోని నాందేడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది.

మళ్లీ మోగిన ఎన్నికల నగారా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన ఈసీ, పూర్తి షెడ్యూల్ ఇదిగో..

ఉపఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ నుంచి 9 స్థానాలు, రాజస్థాన్‌ నుంచి 7, పశ్చిమబెంగాల్‌ నుంచి 6, అసోం 5, బీహార్, పంజాబ్‌లలో చెరో నాలుగు, కర్ణాటకలో 3, కేరళ, సిక్కిం, మధ్యప్రదేశ్‌లలో రెండేసి స్థానాలు, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కో సీటు ఉన్నాయి.

Here's Schedule 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)