New Delhi, FEB 14: చాట్ జీపీటీ! (ChatGPT) ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. అవసరమైన సమాచారాన్ని క్షణాల్లో అందించే ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీతో మేలు ఎంత ఉందో, అదేస్థాయిలో దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా జరిగే సీబీఎస్‌ఈ (CBSE Exams) 10, 12వ తరగతి పరీక్షల్లో (Board Exams) చాట్ జీపీటీ వాడకంపై నిషేదం విధించింది బోర్డు. ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభమయ్యే ఈ పరీక్షల్లో విద్యార్ధులు ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైస్ లు వాడొద్దని సూచించింది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు (Mobiles), చాట్ జీపీటీ (ChatGPT) వాడకంపై నిషేదం విధించింది. ఈ మేరకు ఒక సర్కులర్ జారీ చేసింది సీబీఎస్‌ఈ బోర్డు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)