9 రోజుల క్రితం ( ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన) హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురై కనిపించకుండా పోయిన చెన్నై న‌గ‌ర మాజీ మేయ‌ర్ స‌దాయి దురైస్వామి కుమారుడు, ఫిల్మ్ డైరెక్ట‌ర్ వెట్రి దురైస్వామి మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. స‌ట్లెజ్‌ న‌దిలో ఆయ‌న శ‌వాన్ని గుర్తించారు. ప్రమాదానికి గురైన సమయంలో ద‌ర్శ‌కుడు వెట్రితో ప్ర‌యాణిస్తున్న గోపినాథ్ అనే మ‌రో వ్య‌క్తిని ర‌క్షించారు. ప్ర‌స్తుతం అత‌ను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. కారు డ్రైవ‌ర్ టెంజిన్ ఆ ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. 45 ఏళ్ల వెట్రి కోసం మాత్రం తీవ్రంగా గాలించారు.

కొడుకు కోసం తండ్రి స‌దాయి దొరైస్వామి భారీ రివార్డు కోటి న‌జ‌రానా కూడా ప్ర‌క‌టించారు.న‌దిలో ప‌డిన దర్శకుడు వెట్రి కోసం చాలా బృందాలు గాలించాయి. ఇండో టిబెటిన్ బోర్డ‌ర్ పోలీసు, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫండ్‌, జిల్లా పోలీసులు అన్వేషించారు. తాజాగా మ‌హిన్ నాగ్ అసోసియేష‌న్‌కు చెందిన గజ ఈత‌గాళ్ల బృందం వెట్రి మృత‌దేహాన్ని గుర్తించారు. షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడిక‌ల్ కాలేజీకి అత‌ని డెడ్‌బాడీని పోస్టుమార్ట‌మ్ కోసం తీసుకెళ్లారు. కాగా ఇంద్రావ‌తు ఒరునాల్ అనే త‌మిళ చిత్రాన్ని వెట్రి డైరెక్ట్ చేశాడు.

వెట్రి దురైసామి మృతికి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం సోమవారం సంతాపం తెలిపారు. విచారం వ్యక్తం చేసిన పళనిస్వామి, దురైసామి తన ఏకైక కుమారుడు వెట్రిని కోల్పోయారని, ఇది కోలుకోలేని లోటని అన్నారు. ఆయనకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)