దేశంలో కరోనా సబ్‌వేరియంట్ జేఎన్.1 (JN.1) కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 137 జేఎన్.1 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి జనవరి 8వ తేదీ వరకూ దేశంలో జేఎన్.1 కేసులు 819కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపాయి. దేశంలో నేటి కరోనా కేసుల వివరాలు ఇవిగో, కొత్తగా 475 మందికి కోవిడ్, గత 24 గంటల్లో ఆరు మంది మృతి
మహారాష్ట్రలో 250 జేఎన్.1 కేసులు, కర్ణాటకలో 199 కేసులు, కేరళలో 148, గోవాలో 49, గుజరాత్‌లో 36, ఆంధప్రదేశ్‌లో 30, రాజస్థాన్‌లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, తెలంగాణలో 26, ఒడిశాలో మూడు కేసులు వెలుగుచూశాయి. కాగా BA 2.86 రకానికి చెందిన ఈ జేఎన్.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే.
Here's ANI News
A total of 819 cases of JN.1 series variant have been reported from 12 states in India till 8th January 2024: Sources
— ANI (@ANI) January 9, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)