New Delhi, Jan 9: దేశంలో గత 24 గంటల వ్యవధిలో 475 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 279 కేసులు వెలుగుచూసినట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 61, కేరళలో 54 కేసులు బయటపడినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే దేశంలో క్రియాశీల కేసులు 4వేల దిగువకు పడిపోయాయి.
ప్రస్తుతం దేశంలో 3,919 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే ఆరు మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ముగ్గురు, చత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, అస్సాంలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,402కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,81,859) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.