దేశ రాజధానిలో కోవిడ్ కేసులు(COVID-19 in Delhi) తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం (State Govt) కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు ఆదేశించిన వారాంతపు కర్ఫ్యూలను ఎత్తివేయాలని ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సిఫార్సు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఆమోదం కోసం ఈ ప్రతిపాదనను ఆయన కార్యాలయానికి పంపింది. ప్రస్తుతం వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగులకు ఆఫీస్‌లకు వెళ్లి 50 శాతం సామర్య్ధంతో పనిచేసేలా అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలో పేర్కొంది. అంతేగాక షాపులు తెరవడానికి ఇప్పటివరకు అమలులో ఉన్న సరి, భేసి సంఖ్య విధానం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)