ఢిల్లీలోని ఓ ప్రైవేటు స్కూళ్లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించింది. ఓ టీచ‌ర్‌తో పాటు విద్యార్థి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డ్డారు. దీంతో మిగ‌తా విద్యార్థులంద‌రూ సెల‌వులు ప్ర‌క‌టించారు. అయితే ఢిల్లీలో కొత్త‌గా 299 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఢిల్లీకి స‌మీపంలోని నోయిడా, ఘ‌జియాబాద్‌ల్లోనూ పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. ఢిల్లీలోని ప్రైవేటు స్కూల్ కూడా ఈ ప్రాంతాల‌కు స‌మీపంలో ఉంది.క‌రోనా క‌ల‌క‌లంపై ఆప్ ఎమ్మెల్యే అతిషి స్పందించారు. ఒక టీచ‌ర్, విద్యార్థికి క‌రోనా పాజిటివ్ అని తేలింద‌ని త‌మ‌కు నివేదిక‌లు వ‌చ్చాయ‌న్నారు. ఆ స్కూల్లో ఉన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)