దేశ రాజధాని నగరం ఢిల్లీ(Delhi)లోని ఓ ప్రైవేటు పాఠశాల(Delhi School)కు బాంబు బెదిరింపు(Bomb Threat)కాల్ కలకలం రేపింది. పుష్పవిహార్‌ ప్రాంతంలోని అమృత పాఠశాలకు ఉదయం 6.35 గంటల సమయంలో ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. దీనిపై అప్రమత్తమైన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

పాఠశాలను ఖాళీ చేయించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు తెలిపారు.సుమారు నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన. ఏప్రిల్‌లో మథురా రోడ్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, సాదిఖ్ నగర్‌లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌కు ఇలాగే మెయిల్స్ వచ్చాయి. అప్పుడు కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.

ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)