New Delhi, June 28: కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి పి.పి. మాధవన్(71)పై ఢిల్లీ పోలీసులు అత్యాచార కేసు నమోదైంది. జాబ్ ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని మాధవన్ తనను బెదిరించి లోబర్చుకున్నారంటూ ఓ మహిళ (26) ఫిర్యాదు చేసిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. ఆమె భర్త కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ హోర్డింగులు ఏర్పాటు చేసేవాడని, 2020లో చనిపోయాడని అన్నారు. భర్త చనిపోయాక ఆర్థిక పరిస్థితి బాగోలేక.. కాంగ్రెస్ ప్రతినిధులను కలిశానని, వాళ్లు మాధవన్ నెంబర్ ఇచ్చారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబర్చుకున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మేరకు జూన్ 25వ తేదీన ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.ఒకరోజు నన్ను కలవడానికి పిలిచాడు. అతను నన్ను కారులో ఎక్కించుకోవడానికి వచ్చి.. తన డ్రైవర్‌ను కారు వదిలి వెళ్ళమన్నాడు. నాపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత నన్ను ఒంటరిగా రోడ్డుపై వదిలేశాడు అని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే కేవలం కాంగ్రెస్ పార్టీ పరువు తీసేందుకే ఇది నిరాధారమైన ఆరోపణ. అందులో వాస్తవం లేదు. ఇది పూర్తి కుట్ర అని పీపీ మాధవన్ చెప్తున్నారు.
Congress president Sonia Gandhi's personal secretary P P Madhavan says “false” charges of rape, criminal intimidation aimed at vilifying his image out of political vendetta
— Press Trust of India (@PTI_News) June 27, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)