ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదో సారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న ఈడీ ముందు హాజరుకావాలని మంగళవారం జారీ చేసిన సమన్లలో పేర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం, మనీ లాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఈడీ సీఎం కేజ్రీవాల్‌కు ఏడు సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఆయన వరుసగా ఏడు సార్లు ఈడీ విచారణకు హాజరుకాకపోవటం గమనార్హం.ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఈడీ ఇన్నిసార్లు సమన్లు జారీ చేయటం రికార్డుగా తెలుసోంది. సమన్లు జారీ చేసిన ప్రతిసారి తనను తప్పుడు కేసులో ఇరికించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపణలు చేస్తున్నారు.

Here's PTI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)