దేశ రాజధాని నగరం ఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లోని ఓ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు హుటాహుటిన దాదాపు 30 అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో, బ్లాక్ 1 వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఈ సమాచారం అందిన వెంటనే దాదాపు 30 అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ ఇచ్చిన ట్వీట్‌లో, సెంట్రల్ మార్కెట్లోని ఓ బట్టల దుకాణంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

మొత్తం 30 అగ్ని మాపక శకటాలతో మంటలను ఆర్పుతున్నట్లు తెలిపారు. ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు సమాచారం లేదని తెలిపారు. ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మంటలు భారీగా చెలరేగడంతో పెద్ద ఎత్తున పొగ, ధూళి మేఘాలు వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)