ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఆప్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనుంది. అంతకుముందు, సిబిఐ తన అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీ డివై సిఎం మనీష్ సిసోడియా చేసిన అభ్యర్థనను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది.ఈ నేపథ్యంలో ఆమ్మ ఆద్మీ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను రౌస్ అవెన్యూ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట నిన్న హాజరుపరిచింది సీబీఐ. ఈ కేసులో ఆయనను విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలని కోరింది.సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సిసోడియాకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Here's ANI Update
AAP to go to Delhi HC pertaining to Delhi Dy CM Manish Sisodia's arrest by CBI: AAP
Earlier, SC refused to entertain Delhi Dy CM Manish Sisodia's plea against his arrest by CBI & suggested him to move High Court. https://t.co/IyRQtI7bnM
— ANI (@ANI) February 28, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)