ఢిల్లీ పోలీసు క‌మీష‌న‌ర్‌గా సంజ‌య్ అరోరా ఇవాళ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. త‌మిళ‌నాడు క్యాడ‌ర్‌ కు చెందిన అరోరా 1998వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీస‌ర్. జూలై 31, 2025లో ఆయ‌న రిటైర్ కానున్నారు. అరోరాకు ముందు గ‌తంలో ఆస్థానా(గుజ‌రాత్ క్యాడ‌ర్), అజ‌య్ రాజ్ శ‌ర్మ‌(యూపీ క్యాడ‌ర్)లు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. జైపూర్‌లోని మాల్వియా నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో ఎల‌క్ట్రిక‌ల్ అండ‌ర్ ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ డిగ్రీ చేశారు. 57 ఏళ్ల సంజ‌య్ అరోరా త‌మిళ‌నాడు పోలీసుకు చెందిన స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ లో చేశారు. వీర‌ప్ప‌న్‌ను అంతం చేసిన టీమ్‌లో ఈయ‌న ఉన్నారు. సీఎం గ్యాలెంట‌రీ అవార్డు కూడా అందుకున్నారు.సీఆర్పీఎఫ్‌, బీఎస్ఎఫ్ ద‌ళాలోనూ అరోరా కొన్నేళ్లు చేశారు. ఇంట‌ర్ క్యాడ‌ర్ డిప్యూటేష‌న్‌కు అంగీక‌రించిన‌ట్లు కేంద్ర హోంశాఖ త‌న స‌ర్క్యూల‌ర్‌లో తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)