దేశ రాజధాని ఢిల్లీలో నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అతడి ప్రైవేట్ పార్టులపై కర్రలతో దారుణంగా కొట్టారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని అక్కడే వదిలి పారిపోయారు.ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌ స్వాతి మాలివాల్ తీవ్రంగా స్పందించారు.

ఢిల్లీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదు అని మండిపడ్డారు. మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఒక్క నిందితుడిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా ముగ్గురు పరారీలో ఉన్నారు. ఘటనపై మహిళా ప్యానెల్‌ ఢిల్లీ పోలీసులకు నోటీసులు పంపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)