దేశ రాజధాని ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం జరగడంతో మంటలు వ్యాపించాయి. ప్రాణాలతో బయటపడేందుకు కోచింగ్ సెంటర్ బిల్డింగ్ కిటికీల నుంచి విద్యార్ధులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్ధులు గాయపడ్డారు. ఘటనా ప్రాంతానికి 11 అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయని అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్ధులను బయటకు రప్పించామని ఢిల్లీ ఫైర్ సేఫ్టీ చీఫ్ వెల్లడించారు. కాగా, అగ్నిప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ఘటనా స్ధలంలో సహాయ కార్యక్రమాలను అధికారులు వేగవంతం చేశారు.
ANI Video
All persons have been rescued from the building; fire fighting operation concluded. So far, no major injuries reported: Delhi Fire Department https://t.co/HHWxon6umP pic.twitter.com/1JIH4cgaWB
— ANI (@ANI) June 15, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)