ఢిల్లీలో గాలి మళ్లీ కలుషితమైంది. కాలుష్యం ‘తీవ్రస్థాయి’కి చేరింది. ఇవాళ ఉదయం వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ)లో గాలి నాణ్యత అత్యంత హీనస్థాయికి పడింది. ఢిల్లీ రాజధాని ప్రాంతాల్లో ఏక్యూఐ 400 (సివియర్)కుపైగా నమోదైంది. మిగతా చోట్ల 312గా రికార్డయింది. నోయిడాలో 479, వివేక్ విహార్ ప్రాంతంలో 471, ఆనంద్ విహార్ లో 451గా ఏక్యూఐ రికార్డయింది. లోధి రోడ్డులో 339గా నమోదైంది. గాలుల వేగం అత్యంత తక్కువగా ఉండడంతో కాలుష్య కారకాలన్నీ గాలిలో చేరాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే రాబోయే రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని, దాని వల్ల గాలి శుభ్రమవుతుందని అన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)