అక్ర‌మాస్తుల కేసులో హ‌ర్యానా మాజీ సీఎం ఓం ప్ర‌కాశ్ చౌతాల‌కు ఇవాళ ఢిల్లీకి చెందిన సీబీఐ కోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష‌ను ఖ‌రారు చేసింది. ఆయ‌న‌కు 50 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. మాజీ సీఎం చౌతాలాకు చెందిన నాలుగు ప్రాప‌ర్టీల‌ను కూడా సీజ్ చేయాల‌ని కోర్టు త‌న ఆదేశాల్లో పేర్కొన్న‌ది. విచార‌ణ సంద‌ర్భంగా కోర్టురూమ్‌కు ప్ర‌త్యక్షంగా చౌతాలా హాజ‌ర‌య్యారు. అక్ర‌మాస్తుల కేసులో స్పెష‌ల్ జ‌డ్జి వికాశ్ దుల్ గ‌త వార‌మే తీర్పునిస్తూ చౌతాలాను దోషిగా తేల్చారు. 1993 నుంచి 2006 మ‌ధ్య ఆదాయానికి మించి ఆస్తుల‌ను క‌లిగి ఉన్న కేసులో చౌతాలాను విచారించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)