Farmers' Protest 2.0: ఢిల్లీ వైపు దూసుకెళ్లేందుకు ఒక్కచోటకు చేరుకున్న వేలాది మంది రైతులు, పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద హైటెన్సన్, వీడియో ఇదిగో..
దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిరసన తెలిపే రైతులను ఆపడానికి ఢిల్లీ పోలీసు సిబ్బంది ఢిల్లీ-యుపి అప్సర సరిహద్దులో మోహరించారు. ఇక పంజాబ్-హర్యానా శంబు సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో రైతులు తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి తరలివెళ్లేందుకు రెడీ అయ్యారు.
కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు నేడు ఢిల్లీ చలో’ మార్చ్ తలపెట్టిన సంగతి విదితమే. రైతుల నిరసనతో రాజధాని హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది.కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఏకంగా నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.దేశ రాజధానిలోకి ప్రవేశించకుండా నిరసన తెలిపే రైతులను ఆపడానికి ఢిల్లీ పోలీసు సిబ్బంది ఢిల్లీ-యుపి అప్సర సరిహద్దులో మోహరించారు. ఇక పంజాబ్-హర్యానా శంబు సరిహద్దు వద్ద పెద్ద సంఖ్యలో రైతులు తమ వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి తరలివెళ్లేందుకు రెడీ అయ్యారు.
Here's Videos
#WATCH | Protesting farmers in large numbers at Punjab-Haryana Shambu border to move towards Delhi to press for their various demands pic.twitter.com/V0DKAfaUgV
— ANI (@ANI) February 13, 2024
#WATCH | Delhi police personnel deployed at Delhi-UP Apsara border as a measure to stop protesting farmers from entering the national capital pic.twitter.com/2qz5QkMNtY
— ANI (@ANI) February 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 13, 2024 11:49 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

