దేశ రాజధాని ఢిల్లీలో పటాకులపై ఆమ్ ఆద్మీ సర్కారు మరోసారి నిషేధం విధించింది. వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ వరకు బ్యాన్‌ అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌ బుధవారం ప్రకటించారు.దేశ రాజధాని ఢిల్లీలో బాణాసంచా తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఆన్‌లైన్‌ బాణాసంచా విక్రయాలకు సైతం నిషేధం వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు.దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఢిల్లీలో దీపావళి పటాకులపై ప్రభుత్వం నిషేధించడం ఇది మూడోసారి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)