ఢిల్లీలో నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) భారత్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మధ్యాహ్నం ఆయన రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌లో అడుగుపెట్టారు. విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా, సీఎం భజన్‌లాల్‌ శర్మ ఆయనకు స్వాగతం పలికారు. రాంబాగ్ ప్యాలెస్‌లో మెక్రాన్ కోసం ప్రత్యేక విందు ఏర్పాటుచేశారు.

గణతంత్ర వేడుకలకు తొలుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించగా, వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరుకాలేనని బైడెన్‌ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడిని ఆహ్వానించగా ఆయన అంగీకరించారు. గతేడాది జులైలో పారిస్‌లో నిర్వహించిన ఫ్రాన్స్‌ జాతీయ దినోత్సవ ‘బాస్టిల్‌ డే’ పరేడ్‌లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)