దేశ వ్యాప్తంగా గడిచిన 8 రోజుల్లో ఏడు సార్లు చమురు ధరలు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.61 కాగా, డీజిల్ ధర రూ. 99.83గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ. 115.37, డీజిల్ రూ. 101.23గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21, డీజిల్ ధర రూ. 91.47, ముంబైలో పెట్రోల్ రూ. 115.04, డీజిల్ రూ. 99.25, చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.94, డీజిల్ ధర రూ. 96, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ. 109.68, డీజిల్ ధర రూ. 94.62గా ఉంది.
ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు నిన్న డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదలకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధమే కారణమన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి.
7th upward fuel price revision in 8 days, dearer by Rs 5/litre now
Read @ANI Story | https://t.co/Ozj1yjK6WV#FuelPriceHike #FuelPrices #PetrolDieselPrice #PetrolDieselPriceHike pic.twitter.com/ZBmA3s1yKq
— ANI Digital (@ani_digital) March 29, 2022
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)