ప్రైవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ.. లోన్‌లపై వడ్డీ రేట్ల(ఎంసీఎల్‌ఆర్)ను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రతినిధులు తెలిపారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఎంసీఎల్‌ఆర్ వడ్డీరేట్లు 10 బేసిస్ పాయింట్ల పెరిగాయి. దీంతో ప్రస్తుతం మొత్తం ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు 8.60 శాతంగా ఉన్నాయి.
నెల వ్యవధి కాలానికి ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు 8.60శాతం, మూడు నెలల టెన్యూర్ కాలానికి 8.65శాతం, ఆరునెలల కాలానికి 8.75శాతం, ఏడాది కాలానికి కన్జ్యూమర్ లోన్స్ 8.85శాతం నుంచి 8.90శాతానికి పెరిగాయి. రెండేళ్ల టెన్యూర్ కాలానికి 9శాతం, మూడేళ్ల టెన్యూర్ కాలానికి ఎంసీఎల్‌ఆర్ వడ్డీ రేట్లు 9.10శాతంగా ఉన్నాయి.
Here's Update
HDFC Bank raises loan interest rates; EMIs to rise further https://t.co/mQKpIjXOL3
— ET Wealth (@ET_Wealth) February 7, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)