తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఊటీ ప్రాంతంలోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నవారు మంటల్లో కాలిపోయారు. మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది.
అయితే ఇంకా ప్రాణాలతో ఉన్న ఆ 14వ వ్యక్తి ఎవరనే ప్రశ్న ఉత్కంఠను పెంచుతోంది. మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత బిపిన్ రావత్ ను అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. కాలిన శరీరంతో ఒంటిపై బట్టలు లేకుండా ఆయన ఉన్నారు (కాలిపోతున్న దుస్తులను బహుశా ఆయనే తొలగించి ఉండొచ్చు). బిపిన్ రావత్ కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బిపిన్ రావత్ ప్రాణాలతో బయటపడాలని యావత్ దేశం కోరుకుంటోంది. మరోవైపు డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించనున్నట్టు తెలుస్తోంది.
13 of the 14 personnel involved in the military chopper crash in Tamil Nadu have been confirmed dead. Identities of the bodies to be confirmed through DNA testing: Sources
— ANI (@ANI) December 8, 2021
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)