భారతీయ సిబ్బందితో కూడిన ఓడ సోమాలియా తీరంలో హైజాక్ కు గురైన సంగతి విదితమే.హైజాక్ చేయబడిన ఓడ 'MV LILA NORFOLK' షిప్‌లో 15 మంది భారతీయులు చిక్కుకుపోయారు. తాజాగా అరేబియా సముద్రంలో హైజాక్ చేయబడిన ఓడ MV లిలీ నార్ఫోక్ నుండి 15 మంది భారతీయులను రక్షించడానికి యాంటీ పైరసీ ఆపరేషన్ (Anti-Piracy Operation) గురించి ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ R హరి కుమార్ (Indian Navy Chief Admiral R Hari Kumar) మాట్లాడారు.  15 మంది భారత సిబ్బంది ఉన్న ఓడ సోమాలియా తీరంలో హైజాక్, రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ యుద్ధనౌక INS చెన్నై

"వారు ఎక్కడ ఉన్నా మన జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడం మా కర్తవ్యం. ఇది భారతీయ జెండాతో కూడిన ఓడ కాదు, అయినా సిబ్బంది భారతీయులే వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మా జాతీయ విధానం. సుడాన్, ఉక్రెయిన్‌లలో కూడా మేము అదే చేసాము. మా దేశస్థులను వారు ఎక్కడున్నా తిరిగి తీసుకురావడానికి మేము సవాలుగా తీసుకుంటాము. పైరసీని ఎలాగైనా నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని మా నావికాదళ అధికారులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయని తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాలనుకుంటున్నామని తెలిపారు.

Here's Indian Navy Chief Speech Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)