Newdelhi, Nov 20: తుర్కియే నుంచి భారత్ కు (India) రావాల్సిన కార్గో షిప్ ‘గెలాక్సీ లీడర్’ (Galaxy Leader) హైజాక్ (Hijack)కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ షిప్ లో వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. తాము ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్నామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. కార్గో షిప్ హైజాక్‌కు గురైన విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. మరోవైపు.. ఈ నౌకలో భారతీయులు ఎవరూలేరని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.
India-bound cargo ship hijacked by Houthi rebels from Yemen.
.
.
.#Yemen #HouthiRebels #Hijack #Ship pic.twitter.com/uswejFvcZR
— JioNews (@JioNews) November 20, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)