ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి (IndiGo Flight) బాంబు బెదిరింపు కలకలం రేపింది. మంగళవారం ఉదయం 5.35 గంటలకు ఇండిగో 6ఈ2211 విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి బయల్దేరాల్సి ఉన్నది. అయితే టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా బాత్రూమ్‌లో ఓ టిష్యూ పేపర్‌పై బాంబు అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా కిందికి దించేశారు. ఢిల్లీ పాఠశాలల్లో బాంబు కలకలం..పలు స్కూల్స్ కి సెలవు
అనంతరం ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు.రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. విమానాన్ని నిర్మాణుష్య ప్రదేశానికి తరలించారని, ఏవియేషన్ సెక్యూరిటీ అధికారులు, బాంబు డిస్పోజల్ టీం క్షుణ్ణంగా తనిఖిచేస్తున్నదని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్పారు.కాగా, ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Here's News
IndiGo flight 6E2211 operating from Delhi to Varanasi had received a specific bomb threat at Delhi airport. All necessary protocols were followed and the aircraft was taken to a remote bay as per guidelines by airport security agencies. All passengers were safely evacuated via… pic.twitter.com/NBdd5fBMHC
— ANI (@ANI) May 28, 2024
VIDEO | Passengers of #IndiGo flight from #Delhi to #Varanasi were evacuated via emergency exit following a bomb threat, earlier today.
The aircraft has been moved to isolation bay and further investigations are being carried out. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/gg8EUKU8U0
— Press Trust of India (@PTI_News) May 28, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)