జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో పేలుళ్లు సంభవించాయి. షోపియాన్‌లోని (Shopian) సెడోలో ఓ ప్రైవేటు వాహనంలో భారీ పేలుడు జరిగింది. దీంతో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారని కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు ఏంటివని తెలుసుకుంటున్నామని వెల్లడించారు. కొన్నిసార్లు మిలిటరీ అవసరాలకోసం, కోవర్ట్‌ ఆపరేషన్‌ కోసం ప్రైవేటు వాహనాలను ఉపయోగిస్తారని చెప్పారు. అయితే వాటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే వినియోగిస్తామన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)