26 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమలం వికసించింది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో (Delhi Assembly Elections) మ్యాజిక్ ఫిగర్ 36 కంటే ఎక్కువ స్థానాల్లో ఆధిక్యతలో దూసుకుపోతోంది బీజేపీ. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాలు వెలువడుతుండటం గమనార్హం. బీజేపీ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఆప్ 26 స్థానాల్లో లీడ్‌లో ఉంది.
ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆసక్తికర ట్వీట్ చేశారు(Omar Abdullah On Delhi Assembly elections). యూపీఏ కూటమిలో ఉండి కూడా ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం వల్ల ఇలాంటి పలితాలు వచ్చాయని తెలిపారు(CM Omar Abdullah). ఓటు షేర్ చీలిపోయి అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ లీడ్ లోకి వెళ్లిందని తెలిపారు.
బీజేపీ ఆఫీస్‌లో సంబరాలు మొదలుకాగా ఆప్ ఇంకా ఆశాభావంతోనే ఉంది. ఇక కేజ్రీవాల్ పోటీ చేస్తున్న న్యూ ఢిల్లీ అసెంబ్లీ స్థానంలో క్షణం క్షణం ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం కేజ్రీవాల్ 350 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కనీసం ఖాతా కూడా ఓపెన్ చేయలేదు.
Jammu and Kashmir CM Omar Abdullah's tweet on Delhi Assembly elections
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)