జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడిన ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. సుమారు మరో 9 మంది గాయపడగా.. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. భద్రతా విధుల్లో భాగంగా బీఎస్‌ఎఫ్‌కు చెందిన ఏడు బస్సుల కాన్వాయ్‌ బయలుదేరింది. ఈ క్రమంలో బ్రెల్‌ గ్రామం వద్ద ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. సమాచారం అందిన వెంటనే స్థానికులు, సాయుధ బలగాలు అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముగ్గరు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.మరోవైపు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 18న తొలిదశ పోలింగ్‌ పూర్తికాగా.. రెండో దశ సెప్టెంబర్‌ 25న జరగనుంది.   శంషాబాద్ విమానాశ్రయంలో విషాదం, అస్వస్థతకు గురై అక్కడే కుప్పకూలిన ప్రయాణీకులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి 

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)