రాజస్థాన్‌లోని కోటాలో పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. (School Bus Overturns) ఈ సంఘటనలో ఆ బస్సులోని స్కూల్ విద్యార్థులు గాయపడ్డారు. ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. సోమవారం మధ్యాహ్నం పిల్లలను ఇంటికి తరలిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు దిగువకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ఉద్యోగం పోయిందని బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం, వెంటనే అలర్ట్ అయి కాపాడిన స్థానికులు
గమనించిన స్థానికులు వెంటనే ఆ స్కూల్ బస్సు వద్దకు చేరుకున్నారు. అద్దాలు పగులగొట్టి అందులోని పిల్లలను బయటకు తెచ్చారు.స్కూల్ బస్సులో ప్రయాణించిన సుమారు 50 మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన పిల్లలను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్కూల్ బస్సు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Here's Video
कोटा में ट्रेंचिंग ग्राउंड के पास स्कूल बस पलटी, एक बच्चे की मौत की सूचना, कई गंभीर घायल. pic.twitter.com/wdvMxiHOsa
— Sarvesh Sharma (@ssarveshsharma) October 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)